తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Thu Apr 10, 2025 10:25AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (ఏప్రిల్ 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక బుధవారం (ఏప్రిల్ 9) స్వామి వారికి మొత్తం 62 వేల 76 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 699 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 27 లక్షల రూపాయలు వచ్చింది.


