తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Mon Apr 7, 2025 9:49AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉ:ది. సోమవారం (ఏప్రిల్ 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఆదివారం (ఏప్రిల్ 6) శ్రీవారిని మొత్తం 72 వేల 960 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 126 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 63 లక్షల రూపాయలు వచ్చింది.


