తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Fri Apr 4, 2025 9:47AM
.webp)
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 4) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక గురువారం (ఏప్రిల్ 3) శ్రీవారిని మొత్తం 58 వేల 784 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 784 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 51లక్షల రూపాయలు వచ్చింది.


