తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Thu Apr 3, 2025 9:45AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (ఏప్రిల్ 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక బుధవారం (ఏప్రిల్ 2) శ్రీవారిని మొత్తం 72 వేల 721 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 545 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది.


