తిరుమలేశుని హుండీ కానుకల ఆదాయం రూ.5.09 కోట్లు
Published on: Wed Apr 2, 2025 10:02AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం (ఏప్రిల్ 1) శ్రీవారిని మొత్తం 72 వేల 981 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల120 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 5 కోట్ల 9 లక్సల రూపాయలు వచ్చింది.


