TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Tue Apr 1, 2025 9:11AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (ఏప్రిల్ 1) తిరుమలేశుని దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.

కాగా సోమవారం (మార్చి 31) శ్రీవారిని మొత్తం 73 వేల ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 27 వేల 440 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల నాలుగు లక్షల రూపాయలు వచ్చింది.