TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Fri Mar 21, 2025 8:48AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (మార్చి 21) శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇక గురువారం (మార్చి 20) శ్రీవారిని మొత్తం 61 వేల 087 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 530 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండా కానుకల ఆదాయం 3 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చింది.