TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో పెరిగిన రద్దీ

Published on: Sat Mar 15, 2025 8:54AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. హోలీ, శని ఆదివారాలు వరుసగా రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం (మార్చి 15) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ టీబీసీ వెలుపలి వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (మార్చి 14) శ్రీవారిని మొత్తం 53 వేల 987 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 880 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 88 లక్షల రూపాయలు వచ్చింది.