TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published on: Fri Mar 14, 2025 9:02AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం, వరుస సెలవుల కారణంగా తిరమలేశుని దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శుక్రవారం (మార్చి 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ ముంట్లు పూర్తిగా నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (మార్చి 12) శ్రీవారిని మొత్తం 51 వేల 148 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 236 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 56 లక్షల రూపాయలు వచ్చింది.