TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Thu Mar 13, 2025 9:24AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం(మార్చి 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎనిమిది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇక బుధవారం (మార్చి 12) శ్రీవారిని మొత్తం 68 వేల 609 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 105 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 86లక్షల రూపాయలు వచ్చింది.