తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.05కోట్లు
Published on: Mon Mar 10, 2025 9:14AM
.webp)
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. సోమవారం (మార్చి 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పది కాంపార్టు మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక ఆదివారం (మార్చి 9) శ్రీవారిని మొత్తం 79 వేల 478 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 667 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 5 లక్షల రూపాయలు వచ్చింది.


