తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Wed Mar 5, 2025 7:47AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మార్చి 5) ఉదయం భక్తులు శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం కాంప్లెక్స్ లోని క్యూలైన్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం (మార్చి 4) శ్రీవారిని మొత్తం 64 వేల 851 మంది దర్శించుకున్నారు. వారిలో 19 వేల 639 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 69 లక్షల రూపాయలు వచ్చింది.


