తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Tue Mar 4, 2025 8:18AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (మార్చి 4)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఆరు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక సోమవారం (మార్చి 3) శ్రీవారికి మొత్తం 65 వేల 683 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 453 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 74లక్షల రూపాయలు వచ్చింది.


