తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Mon Mar 3, 2025 7:50AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం (మార్చి 2) తిరుమల శ్రీవారిని మొత్తం 69 వేల 592 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 273 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 63లక్షల రూపాయలు వచ్చింది.
ఇక సోమవారం (మార్చి 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచ ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు. అయితే టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలకు పైగా సమయం పడుతోంది.


