TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Sun Mar 2, 2025 7:19AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం (మార్చి 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు. అయితే టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక శనివారం (మార్చి 1) శ్రీవారిని మొత్తం 71 వేల 785 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 481 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 84 లక్షల రూపాయలు వచ్చింది.