TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published on: Wed Feb 26, 2025 9:08AM

తిరుమలలో భక్తుల రద్దీ  స్వల్పంగా ఉంది. ఉంది.  బుధవారం (ఫిబ్రవరి 26) ఉదయం భక్తుల క్యూకాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరుగంటల కంటే తక్కువ సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ భక్తులకైతే శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటలలోపే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది. 

 ఇక మంగళవారం(ఫిబ్రవరి 25) శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చింది. మంగళవారం శ్రీవారిని 65,127 మంది దర్శించుకున్నారు. వారిలో 19,307 మంది భక్తులు తలనీ లాలను సమర్పిం చుకున్నారు.మహా శివరాత్రి కావడం వల్ల తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.