తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Tue Feb 25, 2025 8:37AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఫిబ్రవరి 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 66 వేల 764 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 504 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 14 లక్షల రూపాయలు వచ్చింది.


