తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Sun Feb 23, 2025 9:23AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
ఇక శనివారం శ్రీవారిని మొత్తం 78 వేల 110 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 20 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కో్ట్ల 39 లక్షల రూపాయలు వచ్చింది.


