తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Published on: Sat Feb 22, 2025 8:26AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం (ఫిబ్ురవరి 22) ఉదయం శ్రీవారి దర్శనానికి భక్తులు 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎమిమిది గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 65 వేల 327 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 804 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చింది.


