తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు
Published on: Wed Feb 12, 2025 8:29AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (ఫిబ్రవరి12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 30 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.
మంగళవారం శ్రీవారిని మొత్తం 67 వేల 192 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 15లక్షల రూపాయలు వచ్చింది.


