TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sat Feb 8, 2025 8:07AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శనివారం (ఫిబ్రవరి 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 21 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 62 వేల 971 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 439 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 99 లక్షల రూపాయలు వచ్చింది.