తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Mon Dec 23, 2024 8:03AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (డిసెంబర్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భకులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 77 వేల 260 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 223 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 12 లక్షల రూపాయలు వచ్చింది.


