TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Published on: Sun Dec 22, 2024 7:37AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (డిసెంబర్ 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక శనివారం (డిసెంబర్ 21) శ్రీవారిని మొత్తం 72 వేల 411 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 677 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  3 కోట్ల 44 లక్షల రూపాయలు వచ్చింది.