TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published on: Sat Dec 21, 2024 7:23AM

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శనివారం(డిసెంబర్ 21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

ఇక శుక్రవారం (డిసెంబర్ 20) శ్రీవారిని మొత్తం 65 వేల 299 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 297 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 75లక్షల రూపాయలు వచ్చింది.