తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Tue Nov 26, 2024 8:42AM
.webp)
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (నవంబర్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక సోమవారం శ్రీవారిని 63 వేల 637 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 016 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 20 లక్షల రూపాయలు వచ్చింది.


