తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Wed Nov 20, 2024 8:30AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (నవంబర్ 20) శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 62 వేల 248 మంది దర్శించుకున్నారు. వారిలో 18 వేల 852 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 71 లక్షల రూపాయలు వచ్చింది.


