తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Mon Nov 18, 2024 8:48AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (నవంబర్ 18) శ్రీవారి దర్శనం కోసం భక్తులు మూడు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక ఆదివారం స్వామివారికి మొత్తం 71 వేల 441 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 595 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారిక హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 87 లక్షల రూపాయలు వచ్చింది.


