శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటలు
Published on: Fri Oct 25, 2024 8:56AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (అక్టోబర్ 25)ఉదయం శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది.
. ఇక గురువారం శ్రీవారిని మొత్తం 61 వేల 400 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 48 లక్షల రూపాయలు వచ్చింది.


