TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sat Jun 22, 2024 9:32AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం (జూన్ 21) శ్రీవారికి మొత్తం 72 వేల 294 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31 వేల 855 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 30 లక్షల రూపాయలు వచ్చింది. ఇక శనివారం (జూన్ 22) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.