తిరుమలేశుని సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Fri Jun 21, 2024 9:22AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (జూన్ 21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
భక్తుల క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. గురువారం (జూన్ 20) శ్రీవారిని మొత్తం 62 వేల 756 మంది దర్శించుకున్నారు.
వారిలో 31 వేల 510 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆధాయం 4 కోట్ల 23లక్షల రూపాయలు వచ్చింది.


