TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు

Published on: Sun Jun 16, 2024 8:26AM

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఆదివారం (జూన్ 15) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ నందకం గెస్ట్ హౌస్ వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం ( జూన్ 15) శ్రీవారిని మొత్తం 82వేల 886 మంది దర్శించుకున్నారు.

వారిలో 44 వేల 234 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 9 లక్షల రూపాయలు వచ్చింది.