తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Sat Jun 15, 2024 8:43AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.
శనివారం (జూన్ 15) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 66 వేల 783 మంది దర్శించుకున్నారు. వారిలో 36 వేల 229 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 71 లక్షల రూపాయలు వచ్చింది.


