శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు
Published on: Mon Dec 18, 2023 8:35AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం(డిసెంబర్ 18) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని 74వేల 845 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో 26వేల122 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 44లక్షల రూపాయలు వచ్చింది.


