తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Published on: Sat Dec 16, 2023 8:10AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం(డిసెంబర్ 16)ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 10 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శుక్రవారం (డిసెంబర్ 16) శ్రీవారిని 71వేల 37 మంది దర్శించుకున్నారు.
వారిలో 25 వేల 635 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 89 లక్షల రూపాయలు వచ్చింది.


