తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Sat Dec 2, 2023 8:23AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం(డిసెంబర్ 1) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ లైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. శుక్రవారం (నవంబర్ 30) శ్రీవారిని మొత్తం 56వేల950 మంది దర్శించుకున్నారు.
వారిలో 20 వేల 463 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 75లక్షల రూపాయలు వచ్చింది.


