శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
Published on: Sun Nov 26, 2023 7:44AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం(నవంబర్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 68వేల 179 మంది దర్శించుకున్నారు.
వారిలో 27వేల 726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల ఆరు లక్షల రూపాయలు వచ్చింది.


