తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Mon Nov 20, 2023 8:30AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం (నవంబర్ 19) శ్రీవారికి 79వేల 800 మంది భక్తులు దర్శంచుకున్నారు. వారిలో 25వేల962 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 55లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (నవంబర్ 20) శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది.
టోకెన్లు లేని భక్తు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్ స్లాట్ టోకెన్ ఉన్నవారికి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.


