TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Published on: Fri Nov 17, 2023 10:39AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అధికంగా ఉంది. శుక్రవారం (నవంబర్ 17) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (నవంబర్ 16) శ్రీవారిని 62వేల 494 మంది దర్శించుకున్నారు.

వారిలో 27 వేల 666 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 59 కోట్ల రూపాయలు వచ్చింది.