తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Wed Nov 8, 2023 6:16AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులను డైరెక్ట్ లైన్ లో వదులుతున్నారు. టొకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
ఇక మంగళవారం(నవంబర్ 7) శ్రీవారిని 61 వేల 640 మంది దర్శించుకున్నారు. వారిలో 19 వేల 064 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 19 లక్షల రూపాయలు వచ్చింది.


