TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Thu Oct 26, 2023 7:07AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో మూడు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (అక్టోబర్ 25) 65వేల 422 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

వారిలో 23వేల 778 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 30 లక్షల రూపాయలు వచ్చింది.