తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు
Published on: Fri Oct 13, 2023 9:38AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 22 కంపార్ట్ మెట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం(అక్టోబర్ 12) శ్రీవారిని 65వేల 937 మంది దర్శించుకున్నారు.
వారిలో 24వేల101 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 28లక్షల రూపాయలు వచ్చింది.


