TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు

Published on: Wed Sep 6, 2023 10:03AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారిని 71వేల946 మంది దర్శించుకున్నారు. వీరిలో 30వేల294 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 51లక్షల రూపాయలు వచ్చింది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.