తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటలు
Published on: Wed Aug 30, 2023 9:53AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 15 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని మొత్తం 64వేల 214 మంది దర్శించుకున్నారు.
వారిలో 25వేల 777 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4. 05 కోట్ల రూపాయలు వచ్చింది.


