TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

Published on: Tue Aug 29, 2023 8:21AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం శ్రీవారిని 68వేల 263 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 28వేల 355 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు పాతిక కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.