తిరుమలలో భక్తుల రద్దీ
Published on: Mon Aug 7, 2023 7:17AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 83వేల 856 మంది దర్శించుకున్నారు.
28, 403 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలు వచ్చింది.
ఇక సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 25 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.


