TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published on: Fri Jul 21, 2023 7:11AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారిని 63వేల 628 మంది భక్తులు దర్శించుకున్నారు. 33 వేల 548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

హుండీ ఆదాయం 4.26 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.