శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Published on: Wed Jul 19, 2023 9:30AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం అంటూ జూలై 18న శ్రీవారిని 64వేల మంది దర్శించుకున్నారు.
24 వేల 659 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం మూడు కోట్ల 6 లక్షలు వచ్చింది.
ఇక బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో పది కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.


