శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు
Published on: Mon Jul 3, 2023 7:05AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (జులై 3) శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.
ఆదివారం తిరుమల శ్రీవారిని మొత్తం 87,967
మంది భక్తులు దర్శించుకున్నారు. 32,083 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 20 లక్షల రూపాయలు వచ్చింది.


