తిరుమలలో మళ్లీ పెరిగిన రద్దీ
Published on: Fri Jun 23, 2023 10:27AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వారాంతం సమీపించడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
శుక్రవారం (జూన్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది.
ఇక గురువారం (జూన్ 22) శ్రీవారిని 67,294 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,529 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలు వచ్చింది.


