TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.34 కోట్లు

Published on: Wed Oct 22, 2025 8:42AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతుంటారు.

బుధవారం (అక్టోబర్ 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 26 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (అక్టోబర్ 21) శ్రీవారిని మొత్తం 76 వేల 343 మంది దర్శించుకున్నారు. వారిలో 18 వేల768 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చింది.